రాహుల్, రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తోనే మైనార్టీల ఓట్లకు రక్షణ : ఏపీ కాంగ్రెస్ నేత రజీయొద్దీన్ అహ్మద్

రాహుల్, రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తోనే మైనార్టీల ఓట్లకు రక్షణ : ఏపీ కాంగ్రెస్ నేత రజీయొద్దీన్ అహ్మద్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వంటి నాయకుల పో రాటంతోనే అర్హులైన మైనార్టీ పౌరుల ఓట్లకు రక్షణ ఉందని ఏపీ కాంగ్రెస్ నేత రజీయొద్దీన్ అహ్మద్ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా అర్హులైన ఓట్లను రాజ్యాంగ విరుద్ధంగా తొలగిస్తున్నారని మండిపడ్డారు. 

కాంగ్రెస్ చేస్తున్న పోరాటంతోనే దేశంలో, ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో మైనార్టీ ఓట్లను తొలగించకుండా రాహుల్, రేవంత్ రక్షణగా నిలిచారని చెప్పారు. దీంతో తమ ఓట్లు ఉంటాయో.. లేదోనన్న ఆందోళనలో ఉన్న మైనార్టీలకు వీరి పోరాటం కొంత వరకు ఊరటనిస్తుందని రజీయొద్దిన్ అహ్మద్ అన్నారు.