సీఎం కేసీఆర్ కు ఏపీ రైతు గిఫ్ట్!

సీఎం కేసీఆర్ కు ఏపీ రైతు గిఫ్ట్!

సీఎం కేసీఆర్ పార్టీ కొత్త పేరు ప్రకటన నేపథ్యంలో పెద్దఎత్తున నేతలు, అభిమానులు తెలంగాణ భవన్ కు తరలివస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్ వద్ద ఏపీకి చెందిన ఓ రైతు అందరినీ ఆకట్టుకున్నాడు. మూడు ఖాళీ మందు బాటిల్స్లో గులాబీ రంగు దారంతో కారు, కుర్చీ, మంచం తయారు చేసి.. కేసీఆర్కు ఇచ్చేందుకు వచ్చాడు. కేసీఆర్కు బహుమతి అందజేసేందుకు గుంటూరు నుంచి వచ్చినట్లు రైతు చెప్పాడు.