రాయలసీమ ఎత్తిపోతలకు సీడబ్ల్యూసీ అనుమతి తప్పనిసరి

రాయలసీమ ఎత్తిపోతలకు సీడబ్ల్యూసీ అనుమతి తప్పనిసరి

ఏపీ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన సంగమేశ్వరం వద్ద నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు అవసరం లేదని ఎన్జీటీ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ), సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) అనుమతులు తప్పనిసరి అని పేర్కొంది. ఈ రెండు సంస్థల అనుమతి పొందే వరకు ప్రాజెక్ట్ పనులు చేపట్టరాదని ఎన్జీటీ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ప్రాజెక్టుకు సంబంధించి కొత్త డీపీఆర్‌ సమర్పించాలని సూచించింది. కాగా, ఈ నెల 11న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధిచింన కేసులో మరోసారి విచారణ చేపట్టనుంది. మరోవైపు ఏపీ, తెలంగాణ సీఎంలకు  కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లేఖలు రాశారు. అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు నిర్మించవద్దని ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్‌ అంశాల పరిష్కారానికి అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో భేటీ త్వరలో జరగాలని కేంద్రమంత్రి చెప్పారు.