నార్కట్‌పల్లి: కర్ణాటక నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న లారీ నార్కట్ పల్లి పట్టణంలో గురువారం రాత్రి నల్గొండ చౌరస్తా వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా అదుపుతప్పి ఎదురుగా ఉన్న దీపక్ మెడికల్ షాపులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, లారీ డ్రైవర్ కు గాయాలయ్యాయి. సంఘటనకు స్థలానికి పోలీసులు చేరుకొని గాయాలైన వారిని స్థానిక కామినేని హాస్పిటల్ తరలించారు.
ప్రమాద స్థలాన్ని ఇవాళ నల్గొండ ఎస్పీ శరత్చంద్ర పవర్ పరామర్శించారు. గతంలో కూడా ఇక్కడ వరుస ప్రమాదాలు జరగడంపై కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డుపై వాహనాల పార్కింగ్, అడ్డుగా ఉన్న షాప్స్ సైనింగ్ బోర్డులు తొలగించాలని ఆదేశించారు. రోడ్డు నిర్మాణంలో లోపం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించి నిర్మాణంలో ఉన్న లోపాన్ని త్వరలోనే సవరించాలని ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. ప్రస్తుతానికి అక్కడ భారీక్రేడ్స్ ఏర్పాటు చేసి వాహనాల వేగాన్ని నియంత్రించాలని సూచించారు ఎస్పీ.
