
- ముగ్గురిపై కేసులు నమోదు కావడంతో ప్రభుత్వ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల కేసుతో సంబంధం ఉన్న ముగ్గురు డాక్టర్లపై ఏపీ ప్రభుత్వం వేటు వేసింది. ఆంధ్ర మెడికల్ కాలేజీ అనస్థీషియా డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీ డాక్టర్ రవి, గైనకాలజీ డిపార్ట్‌మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉషాదేవి, శ్రీకాకుళం మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ విద్యుల్లతను విధుల నుంచి సస్పెండ్ చేసింది.
వీరిపై కేసులు నమోదు కావడంతో ఆ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ ఆదేశాల మేరకు వారిని సస్పెండ్ చేస్తూ సోమవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సృష్టి ఫెర్టిలిటీ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతతో సంబంధాలు కలిగి ఉన్న విశాఖకు చెందిన ముగ్గురు డాక్టర్లను ఆగస్టు 8న పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.