అమరావతిలో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే

అమరావతిలో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే

జగన్ సర్కార్ కు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని అమరావతిలో ఆర్‌-5 జోన్‌ ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే విధించింది. వెంటనే ఇళ్ల నిర్మాణాలు ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు 2023 ఆగస్టు 03 గురువారం త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

ప్రభుత్వం అమరావతి ఆర్ 5 జోన్ లో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌, జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరిలతో కూడిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. 

ALSO READ:చెత్త టాక్టర్తో తాగుబోతు డ్రైవర్ హల్చల్.. వార్డు మెంబర్ ఇల్లు నేలమట్టం

హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజధానిలో 1,402 ఎకరాలకు 2023 జూలై 24న ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్  శంకుస్థాపన చేశారు. అయితే రాజధాని కోసం త్యాగం చేసిన భూముల్లో ఇతరులకు పట్టాలు ఇవ్వడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  తాజా తీర్పుతో వారంతా సంతోషంగా ఉన్నారు.