రేవంత్రెడ్డికి నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు

రేవంత్రెడ్డికి నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర మూడో సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ రెడ్డికి ఏపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవే పరమా వధిగా రాజకీయాల్లో అంచెలంచెలుగా రేవంత్ రెడ్డి ఎదిగారని బాలకృష్ణ అన్నారు. తెలంగాణ ప్రజలు రేవంత్ పై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారి ఆకాంక్షలను నెరవేర్చాలని కోరారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలని ఆశించారు బాలకృష్ణ.ముఖ్యమంత్రిగా పాలన మార్క్ తో తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేయాలని కోరారు నందమూరి బాలకృష్ణ.