MacBook 2023:యాపిల్ మ్యాక్ బుక్ సైజ్ పెరిగింది

MacBook 2023:యాపిల్ మ్యాక్ బుక్ సైజ్ పెరిగింది

ల్యాప్ టాప్ ల్లో ఎక్కువగా వర్క్ చేసుకునేవాళ్లు, యాపిల్ మ్యాక్ బుక్ వాడటానికి ఇష్టపడుతుంటారు. వాటిలో ఉండే ఫాస్ట్ సాఫ్ట్ వేర్, ఓఎస్, ఫీచర్ల వల్ల ఆ క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ ని మరింత పెంచుతూ యాపిల్15  అంగుళాల మ్యాక్ బుక్ ఎయిర్ తీసుకురాబోతుందని బ్లూమ్ బర్గ్ ఒక నివేదికలో పేర్కొంది. ఈ కొత్త మ్యాక్ బుక్ ఎయిర్ పాత డిజైన్లోనే ఉంటుందని స్పష్టం చేశారు.

ఇదివరకు 12-13 అంగుళాల్లో ఉన్న యాపిల్ మ్యాక్ బుక్ ఇప్పుడు 15.5 అంగుళాలు ఉండబోతుంది. 2023 రెండవ త్రైమాసికంలో ఈ మ్యాక్ బుక్ లు లాంచ్ అవుతాయి. వీటిలో M2, M2 ప్రో చిప్ లు ఉంటాయని తెలుస్తుంది. ఇప్పటివరకు యాపిల్ లో 14 అంగుళాల మ్యాక్ బుక్ లు కేవలం ప్రో మోడల్స్ కే అందుబాటులో ఉండేవి. వాటిని మార్చుతూ ఇక మీదట తీసుకురాబోయే అన్ని మోడల్స్ లో 15 అంగుళాల డిస్ప్లే ఉంటుందని సూచించింది. అంతేకాకుండా మ్యాగ్ సేఫ్ ఛార్జింగ్ పోర్ట్, అప్ గ్రేడెడ్ స్పీకర్ సిస్టమ్, 1080p  కెమెరా ఉంటుందని చెప్తున్నారు.