యూట్యూబ్ ద్వారా మంచి ఫేమ్ తెచ్చుకున్న నిఖిల్ విజయేంద్ర సింహా హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘సంగీత్’. తేజు అశ్విని హీరోయిన్. సాద్ ఖాన్ దర్శకత్వంలో నవీన్ మనోహరన్, చంద్రు మనోహరన్, స్రవంతి నవీన్ కలిసి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ సాంగ్‌ను ఏ.ఆర్.రెహమాన్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ అందించారు.
అచు రాజామణి కంపోజ్ చేసిన ఈ పాటకు విక్రమ్ శివ క్యాచీ లిరిక్స్ అందించగా, సిద్ శ్రీరామ్ పాడిన తీరు ఆకట్టుకుంది. ‘నీవల్లే నీవల్లే.. నా తీరే మారిందే.. ’ అంటూ సాగిన పాటలో నిఖిల్, తేజు జోడీ ఫ్రెష్ ఫీల్‌ని కలిగిస్తుంది. వీరిమధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ప్రేమ, సంగీతం, యువతను ఆకట్టుకునే ఎలిమెంట్స్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని మేకర్స్ తెలియజేశారు.
