ప్రభుత్వ స్థలాల్లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు

 ప్రభుత్వ స్థలాల్లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు

కొత్తగూడెం జిల్లా ఏర్పాటుతో భూముల ధరలకు రెక్కలు

కలెక్టర్ఆదేశాలనూ లెక్క చేయని ఆఫీసర్లు

ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నా.. పట్టించుకుంటలేరు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెంలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. అధికార పార్టీ నేతల బలం.. కొందరు ఆఫీసర్ల అండదండలతో యథేచ్ఛగా భూములను ఆక్రమించి నిర్మాణాలు సాగి స్తున్నారు. ఓ వైపు ప్రభుత్వ స్థలాలు కాపాడాలంటూ కలెక్టర్‌ ఇస్తున్న ఆదేశాలనూ మున్సి పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు.

పట్టణంలోని ఓల్డ్​ బస్ ​డిపో నుంచి మహాంకాళి మాత గుడివైపు వెళ్లే ప్రధాన రహదారిలో దాదాపు రూ.కోటికి పైగా విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు అధికార పార్టీ నేతలు ఎత్తులు వేశారు. గతంలో ఉన్న అధికారులు ఆక్రమణలతో పాటు అక్రమ నిర్మాణాలను అడ్డుకున్నారు. ప్రస్తుతం కబ్జా దారులు ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే ఓల్డ్ ​బస్‌ డిపో ఏరియాలోని స్థలాన్ని ఆక్రమించుకోవటంతోపాటు నిర్మాణాలు చేపట్టడం గమనార్హం. గతంలోనూ అక్రమ నిర్మాణాలను అడ్డుకున్న ఆఫీసర్లు.. ఇప్పుడేమో అనుమతులిచ్చారంటూ కబ్జా రాయుళ్లు అంటుండడం గమనార్హం. ‘మా స్థలం కాకపోతే భూమి రిజిస్ట్రేషన్ ​ఎందుకు అవుతుంది. మున్సిపాలిటీ అధికారులు ఇంటి నెంబర్‌ ఎలా ఇస్తారంటూ’ కబ్జా రాయుళ్లు ఎదురు ప్రశ్నిస్తుండటం గమనార్హం.

రాజీవ్ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదురుగా రోడ్డు స్థలంలో అధికారులు చూస్తుండగానే ఓ గదినే నిర్మించారు. 16వ వార్డులో ఇంటి నెంబర్లు తీసుకుని అక్రమ నిర్మాణాలు చేపడ్తున్నా అధికారులు మాత్రం చర్యలు తీసుకుంటామంటూనే కుం టి సాకులు చెప్తూ తప్పించుకుం టున్నారనే విమర్శలున్నాయి.

5వ వార్డులో రూ.లక్షల విలువైన భూమిని ఓ ప్రజా ప్రతినిధి ఆక్రమించారనే ఆరోపణలున్నాయి.

రామవరంలోని రూ.లక్షలు విలువ చేసే స్థలానికి కొందరు అధికార పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు కలిసి ఎసరు పెట్టినట్టు తెలిసింది.

పట్టణంలోని 143 సర్వే నెంబర్లో పట్టా ల్యాండ్ లేదని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ సర్వే నెంబర్లలో వందల ఎకరాల భూమి ఆక్రమణకు గురవుతోంది. ఆక్రమణదారులు రిజిస్ట్రేషన్​ డాక్యుమెంట్లు సృష్టించి ఆక్రమణకు పాల్పడుతున్నారు.

లక్ష్మీదేవిపల్లి మండలంలోని వెంకటేశ్వర కాలనీ పంచాయతీలోని రూ. కోట్లు విలువ చేసే చెరువును కబ్జా దారులు గిరిజనుల పేర సృష్టించి ఆక్రమించారు. గతంలో ఉన్న చెరువును తొలగించడంతో ప్రస్తుతం అక్కడ పెద్ద ఎత్తు న వెంచర్‌ చేసేందుకు మండలంలోని ప్రముఖ విద్యా సంస్థల అధిపతి ప్లాన్​చేశారు. ఈ విషయంలో ఆ ప్రాంత ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులేమో సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఎవరికిష్టం వచ్చినట్లు వారు కబ్జా

జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో కొంత కాలంగా సింగరేణి, మున్సిపాలిటీ, రెవెన్యూ భూముల మధ్య వివాదాలు నడుస్తున్నాయి. ఇదే అదనుగ భావించిన కబ్జా రాయుళ్లు అధికార పార్టీ అండ దండలతో ఆక్రమణలకు పాల్పడుతున్నారు. జిల్లా కేంద్రంగా మారిన తర్వాత కొత్తగూడెంతో పాటు లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో కబ్జా దారులు ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలపై కన్నేశారు. కొత్తగూడెంలో భూకబ్జా లు జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. గతంలో ఆక్రమణలను అడ్డుకున్న చోట తిరిగి నిర్మాణాలు చేపడుతున్నారు. 143 సర్వే నెంబర్‌లో రిజిస్ట్రే షన్లు చెల్లవు. పట్టణంలో ఎక్కువ రెవెన్యూ, సింగరేణి భూములు ఉన్నాయి. అక్రమ నిర్మాణాలను అడ్డుకుంటాం. ఆక్రమణలను రెవెన్యూ వాళ్లు చూసుకోవాలి.

– ప్రభాకర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్