షాంఘై: భారత ఆర్చరీ జట్టు అయోమయంలో పడింది. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ప్రపంచకప్ స్టేజ్-2లో భారత ఆర్చర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మెక్సికోలో జరిగిన ప్రపంచకప్ స్టేజ్-1లో మహిళల కాంపౌండ్ జట్టు స్వర్ణం గెలిచినప్పటికీ మిగిలిన విభాగాల్లో భారత ప్రదర్శన నిరాశపరిచింది.
ప్రధాన ప్రత్యర్థి దక్షిణ కొరియా లేకపోయినా రికర్వ్ విభాగంలో తరుణ్‌దీప్ రాయ్, అతాను దాస్, ధీరజ్ బొమ్మదేవర, దీపికా కుమారి వంటి సీనియర్లు పతకాలు సాధించలేకపోయారు. పురుషుల రికర్వ్ జట్టు తొలి రౌండ్‌లోనే స్పెయిన్ చేతిలో ఓడిపోగా, మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్‌లో టర్కీ చేతిలో ఓటమి పాలైంది.
