టీ శాట్‍.. అయోమయం..!

టీ శాట్‍.. అయోమయం..!

భద్రాచలం, వెలుగు: కరోనా వేళ విద్యా సంవత్సరం వృథా కాకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం టీశాట్‍ ద్వారా 6 నుంచి10వ తరగతుల స్టూడెంట్లకు డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లు నిర్వహిస్తోంది. ఈ నెల 16 నుంచి 31 వరకు మొదటి దఫా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కానీ.. మండల విద్యాశాఖ అధికారుల నిర్ల‌క్ష్యం కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరిస్థితి అధ్వానంగా ఉంది. అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో..? ఏంటో..? అనేది కూడా ఎవరికీ అంతుబట్టడం లేదు. గ్రామాల్లో ఒక్కోసారి విద్యుత్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమస్య వెంటాడుతోంది. కరెంటు ఉంటే కేబుల్‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రసారాలు ఉండడం లేదు. వాటిని పునరుద్ధరించేందుకు టెక్నీషియన్లు రావాలన్నా పొంగే వాగులు, వంకలు, వర్షాలు ప్రతిబంధకంగా మారుతున్నాయి. ఇది కూడా స్టూడెంట్ల పాలిట శాపంగా తయారయ్యాయి. అయితే కొందరు ఎంఈవోలు మాత్రం‘మా కాడ ఏ తరగతులు జరగడం లేదంటూ’ చెబుతున్నారు. మరి జిల్లాలో టీశాట్‍ విద్యా చానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
ద్వారా డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తరగతులు ఉన్నట్టా..? లేనట్టా..? అనేది గందరగోళంగా ఉంది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చినా జిల్లావిద్యాశాఖ అమలు పరచడంలో నిర్ల‌క్ష్యం చేస్తోంది.

కాకిలెక్కలతో కాలయాపన..

డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ల వ్యవహారంలో ఎంఈవోలు అందిస్తున్నవన్నీ కాకిలెక్కలే. అసలు ఎంత మంది స్టూడెంట్లు ఉన్నారు.. వారిలో ఎందరికి టీవీలు ఉన్నాయి.. ఎంత మందికి కేబుల్ కనెక్షన్లు ఉన్నాయి.. అనే విషయాన్ని ఉన్నతాధికారులు అడిగిన వెంటనే చేతికందిన లెక్కలు పంపించేశారు. అదేలా సాధ్యం అని అడిగితే ఉదయం ఉత్తర్వులు ఇచ్చి మధ్యాహ్నం కల్లా నివేదికలు ఇవ్వమంటే ఎలా..? అని ఎంఈవోలు వేస్తున్న ప్రశ్న. నోటి కొచ్చిన లెక్కలతో నివేదికలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అసలు చాలా మంది ఎంఈవోలకు విషయమే తెలియకపోవడం విశేషం. భద్రాచలం ఎంఈవోను డిజిటల్ క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ల మీద ఆరా తీస్తే తమ దగ్గర అసలు ఎలాంటి క్లాసులు జరగడం లేదని చెప్పారు.

పట్టణ స్టూడెంట్ల వరకే..
టీశాట్‍విద్యా చానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వా రా డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లు నడుస్తున్నాయన్నవిషయం పట్టణ ప్రాంతాల్లోని స్టూడెంట్లకు మినహా పల్లెల్లో ని వారికి ఎవరికీ తెలియదు. కేవలం10 నుంచి 20శాతం మందే టీవీల ముందు పాఠాలు వింటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులు 1,43,298 మంది ఉన్నారు. వారిలో 6 నుంచి 10వ తరగతి వరకు చదివే వారు 80 వేల మంది వరకు ఉంటారు. అయితే.. విద్యాశాఖాధికారులు పిల్లలకు ఈ విషయం చేరవేయడం లేదు. డీఈవో కార్యాలయం నుంచి వచ్చే ఉత్తర్వులను ఎంఈవోలకు పంపితే వారు సీఆర్‍పీలు,హెచ్‍ఎంలకు అందిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఎంతమాత్రం ఉండటం లేదు. కేవలం కాగితాలకే పరిమితం అయ్యింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం