పఠాన్ చెరులో అత్యధిక వర్షపాతం నమోదు

పఠాన్ చెరులో అత్యధిక వర్షపాతం నమోదు

హైదరాబాద్ లో గాలి వాన బీభత్సం సృష్టిస్తోంది. కొన్ని ఏరియాల్లో తేలిక పాటి వర్షాలు పడుతుండగా..  చాలా ఏరియాల్లో  వర్షం దంచి కొడుతోంది. రామచంద్రాపురం, పఠాన్ చెరులో అత్యధికంగా 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. వర్షాలకు ప్రజలు తీవ్ర  ఇబ్బంది పడుతున్నారు. చాలా చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొన్ని చోట్ల కరెంట్ నిలిచిపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు.

ఏరియాల వారీగా నమోదయిన వర్షపాతం వివరాలు

  •  చందానగర్  శేర్లింగంపల్లిలో 5.6 సెంటీమీటర్లు
  • ఆర్సిపురంలో 6.9 సెంటీమీటర్ల 
  • గచ్చిబౌలిలో 5.6 సెంటీమీటర్లు..
  • గాజుల రామారావు లో 5.3 సెంటీమీటర్లు..
  • జీడిమెట్ల లో 4.6 సెంటీమీటర్లు..
  • బిహెచ్ఈఎల్ లో 4.2 సెంటీమీటర్లు..
  • లింగంపల్లిలో 3.2 సెంటీమీటర్లు..
  • మల్కాజిగిరిలో 2.5 సెంటీమీటర్లు..
  • మాదాపూర్ లో 1.8 సెంటీమీటర్లు..
  • అల్వాల్ లో 1.3 సెంటీమీటర్లు