భర్తతో వాగ్వాదం.. బ్రిడ్జిపై నిప్పంటించుకున్న వివాహిత

V6 Velugu Posted on Nov 08, 2020

రంగారెడ్డి జిల్లా: భార్యా భర్తల మధ్య వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన  ఈ విషాధ ఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్మత్ పూర్ బ్రిడ్జిపై జరిగింది.

హిమాయత్ నగర్ కు చెందిన జ్యోతి, ప్రవీణ్ దంపతులు. కొన్నాళ్లుగా రాజేంద్రనగర్ పరిధిలో ఉంటున్నారు. వీరి దాంపత్యంలో తరచూ కలహాలు జరుగుతున్నాయి. భార్య భర్తల మధ్య వాగ్వాదాలు, తగువులు తీర్చే పెద్ద దిక్కు ఎవరూ అందుబాటులో లేరు. దీంతో విసిగిపోయిన జ్యోతి భర్తతో మళ్లీ గొడవ జరగడంతో భరించలేక పోలీసు స్టేషన్ లో కంప్లయింట్ చేసేందుకు బయలుదేరింది. భర్త కూడా వెంట రావడంతో.. కిస్మత్ పూర్ బ్రిడ్జిపై మళ్లీ వాగ్వాదం జరిగింది. జ్యోతి అకస్మాత్తుగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. భర్త వెంటనే తేరుకుని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కాలిన గాయాలతో జ్యోతి ఉస్మానియా హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది.

Tagged woman, set, married, fire, HUSBAND, police station, rajendrangar, commits, suicide, WHO, jyothi, on, in, at, with, limits, to the, Bridge, kismathpoor, went, argument, herself, praveen

Latest Videos

Subscribe Now

More News