తొలి పోరులో విదిత్‌‌‌‌కు అర్జున్ చెక్‌‌‌‌

తొలి పోరులో విదిత్‌‌‌‌కు అర్జున్ చెక్‌‌‌‌

చెన్నై: తెలంగాణ కుర్రాడు, ఇండియా నం.1 ప్లేయర్ ఎరిగైసి అర్జున్‌‌‌‌ చెన్నై చెస్ గ్రాండ్‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌లో శుభారంభం చేశాడు.  2800 ఎలో రేటింగ్ అందుకున్న తర్వాత  ఇండియాలో తొలిసారి బరిలోకి దిగిన అర్జున్ తన మార్కు చూపెట్టాడు.  మంగళవారం ఐదు గంటలకు పైగా హోరాహోరీగా సాగిన తొలి రౌండ్‌‌‌‌ గేమ్‌‌‌‌లో  నల్లపావులతో ఆడిన అర్జున్‌‌‌‌ 96 ఎత్తుల్లో ఇండియాకే చెందిన విదిత్ సంతోష్‌‌‌‌ను ఓడించాడు.  అమెరికాకు చెందిన లెవోన్ అరోనియన్‌‌‌‌.. సెర్బియా ప్లేయర్‌‌‌‌‌‌‌‌ అలెక్సీ సరనతో డ్రా చేసుకున్నాడు.   చాలెంజర్స్ విభాగంలో తెలుగు గ్రాండ్ మాస్టర్  హారిక తొలి గేమ్‌‌‌‌లో 63 ఎత్తుల్లో వి. ప్రణవ్ చేతిలో ఓడిపోయింది.