చెన్నై: ఇండియా గ్రాండ్‌మాస్టర్, తెలంగాణకు చెందిన ఎరిగైసి అర్జున్ చెస్ ఒలింపియాడ్‌లో పోటీ పడనున్నాడు. సెప్టెంబర్‌లో హంగేరిలోని బుడాపెస్ట్ వేదికగా జరిగే ఈ టోర్నీలో పాల్గొనే ఇండియా మెన్స్, విమెన్స్ టీమ్స్‌ను ఆలిండియా చెస్ ఫెడరేషన్ (ఏఐసీఎఫ్) శనివారం ప్రకటించింది. మెన్స్‌లో అర్జున్‌తో పాటు ఏపీ ఆటగాడు పెంటేల హరికృష్ణ, డి. గుకేశ్, ఆర్. ప్రజ్ఞానంద, విదిత్ సంతోష్ ఉన్నారు.
విమెన్స్ టీమ్‌లో ఏపీ అమ్మాయి ద్రోణవల్లి హారికతో పాటు ఆర్. వైష్ణవి, దివ్య దేశ్‌ముఖ్, వంతిక అగర్వాల్, తానియా సచ్‌దేవ్‌కు చోటు దక్కింది. 2022లో బ్రాంజ్ మెడల్ నెగ్గిన టాప్ ప్లేయర్ కోనేరు హంపిని విమెన్స్ టీమ్‌ను తప్పించారు.