
షెన్‌జెన్: తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఎరిగైసి అర్జున్ షెన్‌జెన్ మాస్టర్స్ చెస్ టోర్నీలో రెండో విజయాన్ని సాధించాడు. శనివారం జరిగిన మూడో రౌండ్‌లో అర్జున్ 39 ఎత్తులతో అనీష్ గిరి (నెదర్లాండ్స్)పై గెలిచాడు. ఈ రౌండ్ తర్వాత అర్జున్ రెండు పాయింట్లతో సంయుక్తంగా మూడో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.
మరోవైపు ప్రేగ్ మాస్టర్స్‌లో ఇండియా గ్రాండ్ మాస్టర్స్ త్రయం అర్. ప్రజ్ఞానంద, డి. గుకేశ్, విదితి గుజరాతీ నాలుగో రౌండ్ గేమ్‌లను డ్రా చేసుకున్నారు. ప్రజ్క్షానంద (1.5).. ఎంగుయెన్ థాయ్ డాయ్ వాన్ (చెక్, 1.5)తో, గుకేశ్ (2.5).. నోడిర్బెక్ అబ్దుసత్తారోవ్ (ఉజ్బెకిస్తాన్, 3)తో, విదితి (2).. మాటెస్జ్ బార్టెల్ (పోలాండ్, 1)తో జరిగిన గేమ్‌లను డ్రాగా ముగించారు.