జమ్మూకు ఆర్మీ చీఫ్ కొనసాగుతున్న యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్

జమ్మూకు ఆర్మీ చీఫ్ కొనసాగుతున్న యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్

జమ్మూ :  ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే సోమవారం జమ్మూకాశ్మీర్ వెళ్లారు. మొదట జమ్మూకు చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి రాజౌరీ–పూంచ్ సెక్టార్ కు వెళ్లారు. అక్కడ భద్రతా పరిస్థితులపై సమీక్ష చేయనున్నారు. ఈ సెక్టార్ లో ఇటీవల ఆర్మీ వెహికల్స్ పై టెర్రర్ దాడి జరిగింది. ఇందులో నలుగురు సైనికులు చనిపోయారు. దీంతో టెర్రరిస్టుల కోసం ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. కొంతమందిని అదుపులోకి తీసుకుంది. అయితే వారిలో ముగ్గురు చనిపోయారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జమ్మూకు వెళ్లారు. కాగా, నార్తర్న్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, వైట్ నైట్ కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ సందీప్ జైన్ ఆధ్వర్యంలో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆర్మీ వెహికల్స్ పై దాడి జరిగిన రాజౌరీలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. మరోవైపు రాజౌరీ–పూంచ్ సెక్టార్ లో మొబైల్ ఇంటర్ నెట్ సేవలు నిలిపివేశారు.