
జమ్ము కశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో ఈ రోజు ఉదయం ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటన విషాదాంతమైంది. శివ్ గఢ్ ఏరియాలో పొగ మంచు కారణంగా ఇండియన్ ఆర్మీ చీతా హెలికాప్టర్ కూలిపోయింది. ఆ సమయంలో స్థానికులు చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన జరిగిన సమయంలో హెలికాప్టర్‌లో ఇద్దరు జవాన్లు ఉన్నారు. వారిద్దరికీ గాయాలయ్యాయి. కొద్ది నిమిషాల్లోనే పోలీసులు, రెస్క్యూ టీమ్స్, స్థానికులు కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు ఆర్మీ జవాన్లను రక్షించి ఆస్పత్రికి తరలించారని ఉధంపూర్ డీఐజీ సులేమాన్ చౌధరి తెలిపారు. అయితే హెలికాప్టర్ కూలినప్పుడు తీవ్రంగా గాయాలు కావడంతో ట్రీట్‌మెంట్‌కు స్పందించలేదని, వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.