ఆర్మీ పాసింగ్ ఔట్ పరేడ్ ఒక ఆర్మీ జవాన్ కు లైఫ్ టైమ్ మెమరబుల్ ఈవెంట్ గా మారింది. పరేడ్ పూర్తియిన వెంటనే తన ప్రేయసికి చెప్పిన మ్యారేజ్ ప్రపోజల్.. అక్కడున్న వాళ్లకు ఊహించని ట్విస్టు ఇచ్చింది. హెలికాప్టర్ ముందు మోకాలిపై కూర్చుని విల్ యు మ్యారీ మీ.. అంటూ చేసిన ప్రపోజల్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్ల కామెంట్స్ తో ట్రెండ్ అవుతోంది.
2026 జూన్ 02న నాశిక్ లో జరిగిన కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్ (CAATS) లో.. కొత్తగా శిక్షణ పూర్తి చేసుకున్న పైలట్లకు పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హాజరైన ఈ కార్యక్రమం ముగింపు ఇచ్చిన ట్విస్టు అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ట్రైనింగ్ పూర్తి చేసుకుని.. ఆర్మీ పైలట్ గా కొత్త బాధ్యతలు తీసుకోనున్న భరత్ భరద్వాజ్ అనే పైలట్.. తన ప్రేయసి ఆరుషి కి హెలికాప్టర్ ముందు కూర్చుని చేసిన ప్రపోజల్ సినిమా సీన్ ను మించిపోయింది. పరేడ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే.. అందరూ చూస్తుండగా మోకాలిపై కూర్చుని నన్ను పెళ్లి చేసుకుంటావా...? అంటూ ప్రపోజ్ చేశాడు.
►ALSO READ | OSM తప్పులపై కేంద్రం ఆగ్రహం.. CBSE బోర్డ్ ఛైర్మన్, సెక్రటరీపై బదిలీ వేటు
భరద్వాజ్ ప్రపోజల్ కు అక్కడున్న వాళ్లు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఫోన్ తీసి వీడియో తీశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రొఫెషనల్ లైఫ్ లో సాధించిన వాటికి.. ఈ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రపోజల్ మైల్ స్టోన్ గా ఉంటుందని అంటున్నారు.
భరద్వాజ్ ప్రపోజల్ ను ఆరుషి అంగీకరించింది. దీంతో అక్కడ చప్పట్లు, కేరింతలతో కోలాహలంగా మారిపోయింది. ట్రైనీలందరూ ఈ జంటకు మద్ధతుగా క్లాప్స్ కొట్టారు.
- దేశభక్తి, అచీవ్మెంట్, రొమాన్స్ ల కలియక:
లవ్ ప్రపోజల్ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. దేశభక్తి, విజయం, ప్రేమల కలయిక అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. దేశ భక్తిలో భాగంగా పాసింగ్ ఔట్ అయ్యే వరకు ప్రపోజ్ చేయకుండా.. ఇక డ్యూటీకి ఎక్కడమే అని నిర్ణయించుకున్నాక పర్సనల్ లైఫ్ గురించి సరైన నిర్ణయం తీసుకున్నాడని రిప్లై ఇస్తున్నారు.
ఒకే సారి రెండు కొత్త ప్రయాణాలు అంటే కామెంట్స్ చేస్తున్నారు. ప్రపోజల్ కు మంచి వేదికను ఎంచుకున్నాడని మెచ్చుకుంటున్నారు.
#WATCH | Maharashtra: The passing out parade at the Combat Army Aviation Training School in Nashik, concluded on an emotional note for a couple as Captain Bharat Bhardwaj proposed marriage to his partner. pic.twitter.com/8Un1ZNBP1F
— ANI (@ANI) June 2, 2026
