ఇంట్లో మంటలు అంటుకుని సర్వం కోల్పోయిన బాధితులను ఆర్మీకి చెందిన 20 రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్ ఆదుకుంది. జమ్మూకాశ్మీర్ లోని రామ్ నగరిలో ముస్తాక్ అహ్మద్ దార్ ఇంట్లో శనివారం రాత్రి మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే బెటాలియన్ ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేసింది.
అంతేకాకుండా బాధిత కుటుంబాన్ని ఆదుకుంది. మంటల్లో సర్వం కోల్పోయిన బాధితులకు అవసరమైన రేషన్ సరుకులు, ఆహారం అందజేసింది. కొంత నగదు కూడా ఇచ్చి ఆర్థిక సహాయం చేసింది.
