
టీఐఎఫ్ఆర్లో ఇంజినీర్, లైబ్రరీ ట్రైనీ
ఇంజినీర్, లైబ్రరీ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మే 17వ తేదీలోగా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
పోస్టులు: ఇంజినీర్ (డి)(మెకానికల్) 01, సైంటిఫిక్ అసిస్టెంట్(బి) 01, లైబ్రరీ ట్రైనీ 01.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి బీఎస్సీ, డిప్లొమా, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ, ఎంఈ/ ఎంటెక్, పీహెచ్డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: ఇంజినీర్ (డి)(మెకానికల్) 35 ఏండ్లు, సైంటిఫిక్ అసిస్టెంట్(బి), లైబ్రరీ ట్రైనీ 28 ఏండ్లు మించరాదు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: మే 17.
ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు
టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ భర్తీ కోసం ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మే 29వ తేదీలోగా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య: టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్(టీజీసీ) 142
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత ట్రేడ్ లో బీటెక్ లేదా బీఈ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: కనిష్ట వయోపరిమితి 22 ఏండ్లు. గరిష్ట వయోపరిమితి 27 ఏండ్లు. అభ్యర్థి 1999, జనవరి 2 నుంచి 2006 జనవరి 1 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పూర్తి వివరాలకు www.joinindianarmy.nic.in లో సంప్రదించగలరు.