మహారాష్ట్రలోని రూలింగ్ పార్టకీ చెందిన ఇద్దరు మాజీ మంత్రలకు ముంబై కోర్టు షాకిచ్చింది. మనీల్యాండరింగ్ కేసులో ఆరెస్టు అయిన నవాబ్ మాలిక్, అనిల్ దేశ్‌ముఖ్‌లు ఈ శుక్రవారం జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. అయితే వారి అభ్యర్ధనను కోర్టు తిరస్కరించింది. మహారాష్ట్రలో ఆరు రాజ్యసభ సీట్లకి ఎన్నికలు జరగనున్నాయి.రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఏడుగురు అభ్యర్థులతో పోటీ నెలకొంది. అధికార శివసేన సంజయ్ రౌత్, సంజయ్ పవార్ అనే ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దింపగా, ప్రతిపక్ష బీజేపీ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, అనిల్ బోండే , ధనంజయ్ మహాదిక్ లను అభ్యర్థులగా నిలబెట్టింది - రాజ్యసభ సీటు గెలవాలంటే ఏ అభ్యర్థికైనా 42 ఓట్లు కావాల్సి ఉంటుంది.
