మేడారం జాతర హుండీలు లెక్కింపు.. మూడో రోజు ఆదాయం రూ.2 కోట్లు

మేడారం జాతర హుండీలు లెక్కింపు.. మూడో రోజు ఆదాయం రూ.2 కోట్లు

వరంగల్‍, వెలుగు: మేడారం జాతర హుండీలను హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో మూడోరోజు లెక్కించారు. శనివారం 140 హుండీలు తెరవగా.. విదేశీ కరెన్సీకి సంబంధించి రూ.71,283 ఫారిన్ ఎక్స్చేంజి కానుకలు కలిపి రూ.2 కోట్ల 1 లక్ష 21 వేల 440 ఆదాయం లభించింది. మొత్తంగా గురు, శుక్ర, శనివారాల్లో 425 హుండీలను ఓపెన్‍ చేయగా.. రూ.8 కోట్ల 6 లక్షల 46 వేల 359 ఆదాయం సమకూరింది.