హరీశ్ రావు పై ఈసీకి కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

హరీశ్ రావు పై ఈసీకి కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్  నేతల నుంచి డబ్బులు తీసుకొని ఓటు బీఆర్ఎస్​కు వేయాలని ఇటీవల మున్సిపల్  ఎన్నికల ప్రచారంలో హరీశ్ రావు ఓటర్లను కోరడంపై అధికార పార్టీ నాయకులు శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 

పీసీసీ ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్  రాజేశ్  కుమార్.. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదినిని కలిసి కంప్లైంట్​ ఇచ్చారు. హరీశ్ మాట్లాడిన మాటలు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించేలా ఉన్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.