రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు వీధిన పడుతున్నాయని, రోడ్డు భద్రత నియమాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పోలీసులు అధికారులు సూచించారు. మంగళవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ‘అరైవ్ అలైవ్’ ప్రోగ్రామ్ను చేపట్టారు. ఈ కార్యక్రమంలో హెల్మెట్, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడకూడదని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అవేర్నెస్ కల్పించారు.
జయశంకర్ భూపాలపల్లిలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో వరంగల్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, మహబూబాబాద్ జిల్లా తొర్రూర్లో డీఎస్పీ కృష్ణ కిషోర్, ములుగు జిల్లా వెంకటాపురంలో సీఐ ముత్యం రమేశ్ అవగాహన కార్యమాల్లో పాల్గొని మాట్లాడారు.- జయశంకర్ భూపాలపల్లి/ ఎల్కతుర్తి/ తొర్రూర్/ వెంకటాపురం, వెలుగు
