పంజాబ్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ అర్ష్ దీప్ సింగ్ కు బీసీసీఐ షాకిచ్చింది. యజువేంద్ర చాహల్ వేపింగ్ ఎఫెక్ట్.. అర్ష్ దీప్ పై పడింది. ఫ్లైట్ లో చాహల్ వేపింగ్ (దమ్ము కొట్టడం) చేస్తూ వీడియోలో పట్టుబడటం ఎంత వైరల్ గా మారిందో తెలిసిన విషయమే. ఈ వ్యవహారంపై చాలా వరకు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో.. వ్లాగింగ్ ఆపేయాలంటూ అర్ష్ దీప్ కు బీసీసీఐ వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
దీనికి కారణం అర్ష్ దీప్ వ్లాగ్ వీడియోలే. జనరల్ గా అర్ష్ దీప్ వీడియోస్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటం అందరికీ తెలిసిందే. అయితే ఎప్పటిలాగే వ్లాగింగ్ చేస్తండగా.. అందులో చాహల్ వేపింగ్ చేస్తున్న విజువల్స్ బయటపడ్డాయి. ఇది చూస్తుండగా దేశ వ్యాప్తంగా వైరల్ గా మారటంతో .. బీసీసీఐ ఈ ఇష్యూలోకి ఎంట్రీ ఇచ్చింది.
టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో వ్లాగింగ్ కు దూరం ఉండాలని అర్ష్ దీప్ కు బీసీసీఐ సూచించింది. ఈ వ్లాగింగ్ వల్లనే లేని పోని పర్సనల్ విషయాలు, సీక్రెట్ మ్యాటర్స్, కొన్నిసార్లు వివాదాస్పద అంశాలు బయటపడుతున్నాయి. ఆటగాళ్ల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో వ్లాగింగ్ ఆపేస్తేనే బెటర్ అని చెప్పింది.
2026 ఐపీఎల్ లో వేపింగ్ వ్యవహారం ఇది మొదటిది కాదు. రాజస్తాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ కూడ వేపింగ్ చేస్తూ కనిపించాడు. చాహల్ విమానంలో చేస్తే.. పరాగ్ ఏకంగా స్టేడియంలో డ్రెస్సింగ్ రూమ్ లో దమ్ము గుంజుతూ కనిపించాడు. ఈ వ్యవహారంలో రియాన్ పరాగ్ కు 25 శాతం మ్యాచ్ లో కోత విధించారు.
