ప్రజల గొంతుకగా కళలు నిలవాలి : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు 

ప్రజల గొంతుకగా కళలు నిలవాలి : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు 

నారాయణగూడ, వెలుగు: ప్రజల గొంతుకగా కళలు నిలవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం నారాయణగూడలోని మర్వెల్ ఫంక్షన్ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన తెలంగాణ ప్రజా నాట్యమండలి 4వ మహాసభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహాసభలకు ముందు హిమాయత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ ఏఐటీయూసీ కార్యాలయం నుంచి మర్వెల్ ఫంక్షన్ హాల్ వరకు కళాకారులు భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు.

సభా వేదిక వద్ద రచయిత కందిమళ్ల ప్రతాప్ రెడ్డి ప్రజా నాట్యమండలి జెండాను ఆవిష్కరించారు. కూనంనేని మాట్లాడుతూ..తెలంగాణ సాయుధ పోరాటం, వెట్టి చాకిరి నిర్మూలన, కుల వివక్షత, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజా నాట్యమండలి కీలక పాత్ర పోషించిందన్నారు.

నాటి స్ఫూర్తితోనే నేటి కళాకారులు ప్రజా సమస్యల పరిష్కార దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కళాకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వరకు ప్రజా నాట్యమండలి విశేష సేవలందించిందన్నారు.