ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత అరినా సబలెంకా

ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత అరినా సబలెంకా

బెలారస్‌కు చెందిన క్రీడాకారిణి అరినా సబలెంకా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. మెల్ బోర్న్‌లో జరిగిన ఫైనల్లో సబలెంకా 4 – 6, 6 – 3, 6 – 4తో తేడాతో ఎలెనా రైబాకినాపై విజయం సాధించింది. మొదటి సెట్‌లో 4 – 6తో వెనుకబడిన సబలెంకా తర్వాతి రెండు సెట్‌లలో పుంజుకుని తొలి సింగిల్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ ఆనంద సమయంలో సబలెంకా తీవ్ర ఉద్వేగానికి గురైంది. మ్యాచ్ అనంతరం ఉద్వేగాన్ని ఆపుకోలేక ఏడ్చేసింది. ఇక ఆమె కోచ్ కూడా కన్నీళ్లతో తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అంతకుముందు, ఆమె 2021లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేతగా నిలిచింది. 2019 యూఎస్‌ ఓపెన్‌లో డబుల్స్‌ టైటిల్‌ను కూడా గెలుచుకుంది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలవడంతో సబలెంకా ప్రపంచ మహిళల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరింది.