
ఆలిండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇవాళ నామినేషన్ వేశారు. హైదరాబాద్ లోని రిటర్నింగ్ అధికారికి హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా తన నామినేషన్ పేపర్లు సమర్పించారు.
దేశంలోని బలహీన వర్గాలు, అణగారిన ప్రజలు, పేదల గొంతును హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం పార్లమెంట్ లో వినిపిస్తూ వస్తోందని ఈ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. ఆ దేవుడి దయ ఉంటే… ఈ ఆనవాయితీ కొనసాగుతుందని… పేదల జీవితాలు బాగుపడే వరకు ఎంఐఎం పోరాడుతుందని ఒవైసీ అన్నారు.