దమ్ముంటే నాపై పోటీ చేయ్.. రాహుల్ గాంధీకి అసదుద్దీన్ సవాల్

దమ్ముంటే నాపై పోటీ చేయ్..  రాహుల్ గాంధీకి అసదుద్దీన్ సవాల్

ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు.  దమ్ముంటే వాయనాడ్ నుంచి  కాకుండా హైదరాబాద్ నుంచి తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు.  కాంగ్రెస్‌ పార్టీ వల్లే హైదరాబాద్‌లో సమస్యలు వచ్చాయని కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.   కాంగ్రెస్ హయాంలో బాబ్రీ మసీదు, సెక్రటేరియట్ మసీదు కూల్చివేయబడ్డాయి  అని ఒవైసీ అన్నారు. 

ఇటీవల తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఒవైసీ ఈ విధంగా స్పందించారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం ప్రయత్నిస్తుండటంతో కాంగ్రెస్, ఏఐఎంఐఎం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. 

ALSO READ : వందేభారత్ రైలు పాలమూరుకు వరం : డీకే అరుణ

తుక్కుగూడ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ..   తెలంగాణలో  బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పని చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కూటమికి వ్యతిరేకంగా తమ పార్టీ పోరాడుతోందని తెలిపారు.  తాము వేర్వేరు పార్టీలుగా చెప్పుకుంటారు. కానీ వారు ఐక్యంగా పనిచేస్తున్నారని రాహుల్ అన్నారు.  సీఎం కేసీఆర్,   అసదుద్దీన్ ఒవైసీలను మోదీ తన  సొంత వ్యక్తులుగా చూస్తారని వారిపై సీబీఐ, ఈడీ కేసులు లేవని రాహుల్ వ్యాఖ్యానించారు.