యాషెస్‌‌‌‌ ఐదో టెస్ట్‌.. ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్‌..‌‌‌ బెథెల్‌‌‌‌ సెంచరీ.. ఇంగ్లండ్‌‌‌‌ 302/8

యాషెస్‌‌‌‌ ఐదో టెస్ట్‌..  ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్‌..‌‌‌ బెథెల్‌‌‌‌ సెంచరీ.. ఇంగ్లండ్‌‌‌‌ 302/8

సిడ్నీ: ఆస్ట్రేలియాతో యాషెస్‌‌‌‌ ఐదో టెస్ట్‌‌‌‌ను ఇంగ్లండ్‌‌‌‌ ఆఖరి రోజుకు తీసుకెళ్లింది. జాకబ్‌‌‌‌ బెథెల్‌‌‌‌ (142 బ్యాటింగ్‌‌‌‌) కెరీర్‌‌‌‌లో తొలి టెస్ట్‌‌‌‌ సెంచరీ సాధించడంతో.. బుధవారం నాలుగో రోజు ఆట ముగిసే టైమ్‌‌‌‌కు ఇంగ్లండ్‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 75 ఓవర్లలో 302/8 స్కోరు చేసింది. బెథెల్‌‌‌‌తో పాటు మాథ్యూ పాట్స్‌‌‌‌ (0 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నాడు. ఇన్నింగ్స్‌‌‌‌ ఐదో బాల్‌‌‌‌కే జాక్‌‌‌‌ క్రాలీ (1) ఔటైనా.. బెన్‌‌‌‌ డకెట్‌‌‌‌ (42), బెథెల్‌‌‌‌, హ్యారీ బ్రూక్‌‌‌‌ (42) నిలకడగా ఆడారు. ఈ ముగ్గురు కలిసి 113 రన్స్‌‌‌‌ జత చేసి ఇన్నింగ్స్‌‌‌‌ను గాడిలో పెట్టారు.

కానీ, రూట్‌‌‌‌ (6), విల్‌‌‌‌ జాక్స్‌‌‌‌ (0), జెమీ స్మిత్‌‌‌‌ (26), బెన్‌‌‌‌ స్టోక్స్‌‌‌‌ (1), బైడన్‌‌‌‌ కార్స్‌‌‌‌ (16) నిరాశపర్చారు. వెబ్‌‌‌‌స్టర్‌‌‌‌ 3, బోలాండ్‌‌‌‌ 2 వికెట్లు తీశారు. అంతకుముందు 518/7 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 567 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. స్మిత్‌‌‌‌ (138), వెబ్‌‌‌‌స్టర్‌‌‌‌ (71 నాటౌట్‌‌‌‌) రాణించారు. కార్స్‌‌‌‌, టంగ్‌‌‌‌ చెరో మూడు, స్టోక్స్‌‌‌‌ రెండు వికెట్లు తీశారు. ఓవరాల్‌‌‌‌గా ఇంగ్లిష్‌‌‌‌ టీమ్‌‌‌‌ 119 రన్స్‌‌‌‌ లీడ్‌‌‌‌లో కొనసాగుతోంది. ఒక్క రోజు ఆట మిగిలి ఉంది.