‘ఎ మాస్టర్‌‌‌‌ పీస్‌‌’ లో అషూ రెడ్డి

‘ఎ మాస్టర్‌‌‌‌ పీస్‌‌’ లో అషూ రెడ్డి

రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూస్‌‌ తో పాటు బిగ్‌‌ బాస్‌‌ కంటెస్టెంట్‌‌గా పాపులర్‌‌‌‌ అయిన అషూ రెడ్డి.. త్వరలో ఓ సూపర్ హీరో సినిమాలో కనిపించబోతోంది. ‘ఎ మాస్టర్‌‌‌‌ పీస్‌‌’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ కండ్రేగుల నిర్మిస్తున్నారు. శుక్ర, మాటరాని మౌనమిది చిత్రాలతో గుర్తింపును అందుకున్న సుకు పూర్వాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు.

సూపర్ హీరో బ్యాక్‌‌డ్రాప్‌‌లో తెరకెక్కబోయే ఈ సినిమాలో ఆద్య అనే పాత్రలో అషూ రెడ్డి నటించబోతున్నట్టు బుధవారం అనౌన్స్ చేశారు. ఇందులో గ్లామర్‌‌‌‌తో పాటు పెర్‌‌‌‌ఫార్మెన్స్‌‌కు ఇంపార్టెన్స్‌‌ ఉన్న పాత్రను ఆమె పోషించబోతున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌‌ స్టేజ్‌‌లో ఉన్న ఈ మూవీ త్వరలో సెట్స్‌‌కు వెళ్లనుంది. హీరోయిన్‌‌గా సరైన కమర్షియల్‌‌ బ్రేక్‌‌ కోసం ఎదురుచూస్తోన్న అషూరెడ్డికి ఈ సూపర్ హీరో సినిమా ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి!