ఘట్ కేసర్ లో.. ఎఎస్ఐ ఆత్మహత్యాయత్నం

ఘట్ కేసర్ లో.. ఎఎస్ఐ ఆత్మహత్యాయత్నం

ఉన్నతాధికారులు మందలించడమే కారణమని అనుమానం

మేడ్చల్ జిల్లా: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ లో.. ఏఎస్సై గా పని చేస్తున్న రామకృష్ణ ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈనెల 10న ఒక కేసు విషయంలో కొంత మంది వ్యక్తులను పోలీసు స్టేషన్ కి తీసుకురాగ ఒక వ్యక్తి పరిపోయాడని సమాచారం. అందుకు విధులలో ఉన్న ఏఎస్ఐ రామకృష్ణని పై అధికారులు మందలించారని చెప్పుకుంటున్నారు. తాను విధులలో ఉన్న సమయంలో పిఎస్ కి తీసుకువచ్చిన వ్యక్తులలో ఒకడు పారిపోయాడని.. అందుకు షేమ్ గా ఫీల్ అయిన రామకృష్ణ ఇవాళ ఉదయం జెండా పండుగకు హాజరైనా అన్యమనస్కంగానే వ్యవహరించారు. కార్యక్రమం ముగిసిన కొద్దిసేపటి తర్వాత బయటకు వెళ్లిపోయారు. ఇంటికి కాల్ చేసి… ఇంట్లో వాళ్లతో మాట్లాడిన రామకృష్ణ ఇది నా చివరి కాల్ అని చెప్పి ఫోన్ కట్ చేశారు. దీంతో అలర్ట్ అయిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే అలర్టయి రామకృష్ణ ఫోన్ సిగ్నల్ ని ట్రాక్ చేసి, ఘట్ కేసర్ లోని ఓ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి వెంటనే సమీపంలోని సహచర పోలసులకు సమాచారం ఇచ్చారు. సిగ్నల్ ను ట్రేస్ చేస్తూ వెళ్లగా చెట్టుకు ఉరి వేసుకొనే సమయంలో పోలీసులు చేరుకున్నారు.  రామకృష్ణ ని దగ్గర్లోని క్యూర్ హాస్పిటల్ తీసుకొని వెళ్లగా.. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడు రామకృష్ణ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.