Asia Cup 2023 Final: చిత్తుగా ఓడిన లంకేయులు.. ఆసియా కప్ 2023 విజేత భారత్

Asia Cup 2023 Final: చిత్తుగా ఓడిన లంకేయులు.. ఆసియా కప్ 2023 విజేత భారత్

ఆసియా క‌ప్ ఫైన‌ల్లో డిఫెండింగ్ చాంపియ‌న్ శ్రీ‌లంక‌ఘోర ఓటమిని చవిచూసింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లంకేయులు నిర్ధేశించిన 51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత ఓపెనర్లు 37 బంతుల్లోనే చేధించారు. దీంతో మరో 263 బంతులు మిగిలి ఉండగానే భారత్ జయభేరి మోగించింది. 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంకను పేసర్ మహ్మద్ సిరాజ్(6/21) బెంబేలెత్తించాడు. ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఆ ఒక్క ఓవర్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఆరు వికెట్లు తీసుకోగా.. పాండ్యా మూడు, బుమ్రా  ఒక వికెట్ తీసుకున్నారు. 

5 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆసియా కప్

ఈ విజయంతో భారత్.. 5 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆసియా కప్ సొంతం చేసుకుంది. భారత జట్టు చివరి సారిగా 2018లో ఆసియా కప్ గెలిచింది. మొత్తంగా టీమిండియా ఆసియా కప్ టైటిళ్ల సంఖ్య 8. దీంతో అత్యధిక సార్లు ఆసియా కప్ గెలిచిన రికార్డును భారత్ మరింత మెరుపరచుకుంది. అలాగే రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్జు ఆసియా కప్ గెలవడం ఇది రెండో సారి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2018లో కూడా భారత జట్టు ఆసియా కప్ గెలిచింది.