Asia Cup 2025: బంగ్లా గెలిస్తేనే లంక నిలుస్తుంది.. ఇండియా ఓటమి కోరుకుంటున్న శ్రీలంక

Asia Cup 2025: బంగ్లా గెలిస్తేనే లంక నిలుస్తుంది.. ఇండియా ఓటమి కోరుకుంటున్న శ్రీలంక

ఆసియా కప్ లో బుధవారం (సెప్టెంబర్ 24) బంగ్లాదేశ్ తో టీమిండియా తలపడనుంది. టోర్నీలో తిరుగులేకుండా దూసుకెళ్తున్న సూర్య సేన బంగ్లాపై గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ ఎలాగైనా టీమిండియాకు షాక్ ఇచ్చి ఫైనల్ కు చేరువవ్వాలని చూస్తోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో టీమిండియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. రాత్రి 8 గంటలకు సోనీ లివ్ లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లేకే కాదు.. శ్రీలంకకు సైతం ఈ మ్యాచ్ కీలకం కానుంది. 

ఆసియా కప్ లో శ్రీలంక కథ దాదాపుగా ముగిసింది. సూపర్-4 లో ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. తొలి మ్యాచ్ లో అనూహ్యంగా బంగ్లాదేశ్ పై ఓడిన లంక జట్టు మంగళవారం (సెప్టెంబర్ 23) పాకిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడింది.  ప్రస్తుతం సూపర్-4లో శ్రీలంక శుక్రవారం (సెప్టెంబర్ 26) ఇండియాతో ఒక్క మ్యాచ్ ఆడనుంది. శ్రీలంక ఫైనల్ రేస్ లో నిలవాలంటే నేడు బంగ్లాదేశ్ పై ఇండియా ఓడిపోవాలి. అదే సమయంలో గురువారం (సెప్టెంబర్ 25) బంగ్లాదేశ్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోవాలి. ఏదేమైనా బంగ్లాదేశ్ తమ చివరి రెండు మ్యాచ్ ల్లో గెలిస్తేనే శ్రీలంక ఫైనల్ రేస్ లో ఉంటుంది. 

►ALSO READ | నేషనల్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్‌: ఇషా టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బంగ్లాదేశ్ రెండు మ్యాచ్ ల్లో గెలిస్తే ఆ తర్వాత ఇండియాపై జరగనున్న మ్యాచ్ లో శ్రీలంకపై భారీ తేడాతో గెలవాలి. ఇలా జరిగితేనే శ్రీలంక ఫైనల్ కు చేరే అవకాశాలు ఉంటాయి. మంగళవారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో పాక్‌‌‌‌ 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచింది. టాస్‌‌‌‌ ఓడిన శ్రీలంక 20 ఓవర్లలో 133/8 స్కోరుకే పరిమితమైంది. కమిందు మెండిస్‌‌‌‌ (44 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌లతో 50) హాఫ్‌‌‌‌ సెంచరీతో ఆకట్టుకున్నా.. మిగతా వారు నిరాశపర్చారు. పాకిస్తాన్‌‌‌‌ 18 ఓవర్లలో 138/5 స్కోరు చేసింది. హుస్సేన్‌‌‌‌ తలాత్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది.

ఈ రోజు గెలిస్తే ఫైనల్ కు ఇండియా: 

నేడు జరగనున్న మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా ఫైనల్ కు చేరుతుంది.ఇండియా గెలిస్తే శ్రీలంక ఇంటిదారి పడుతుంది. అప్పుడు గురువారం (సెప్టెంబర్ 25) పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లలో గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుతుంది. సూపర్-4 లో దాయాదిని చిత్తు చేసిన జోరును కొనసాగిస్తూ బుధవారం జరిగే సూపర్–4 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పని పట్టేందుకు సూర్య సేన రెడీ అయింది. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గెలిచి తుదిపోరుకు చేరుకోవాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పెట్టుకుంది. గత పోరులో డిఫెండింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీలంకకు షాకిచ్చిన బంగ్లా టైగర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. మరో అద్భుతాన్ని ఆశిస్తున్నారు.