
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టార్ షూటర్ ఇషా సింగ్ నేషనల్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్‌లో సత్తా చాటింది. వరల్డ్ కప్ గోల్డ్ మెడలిస్ట్ ఇషా మంగళవారం భోపాల్‌లోని మధ్యప్రదేశ్ అకాడమీలో ముగిసిన 10 ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో 1.7 పాయింట్ల తేడాతో సైన్యమ్‌ను ఓడించింది.
ఇషా 240.6 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలవగా.. సైన్యమ్ 238.9 పాయింట్లు సాధించింది. అంజలి షెకావత్ 216.5 పాయింట్లతో మూడో ప్లేస్‌లో నిలిచింది. మెన్స్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో సమ్రాట్ రాణా 0.4 పాయింట్ల తేడాతో ఉజ్వల్ మాలిక్‌ను ఓడించి విజేతగా నిలిచాడు. ఒలింపిక్ మెడలిస్ట్ సరబ్‌జోత్ సింగ్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.