కేంద్ర మంత్రివా.. కరీంనగర్ కు మంత్రివా? : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

కేంద్ర మంత్రివా.. కరీంనగర్ కు మంత్రివా? : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
  •     బండి సంజయ్​పై అద్దంకి ఫైర్

హైదరాబాద్, వెలుగు: ‘బండి సంజయ్.. నువ్వు కేంద్ర మంత్రివా? లేదంటే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు మంత్రివా?’ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. శనివారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. బీజేపీకి కరీంనగర్ మేయర్ పదవి దక్కకుంటే ఒక్కొక్కరిని రోడ్లపై ఉరికిస్తానని ఎలా అంటావని ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖకు సహాయ మంత్రిగా ఉంటూ రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా మాట్లాడడం ఏంటని మండిపడ్డారు. ఎన్ని నీచ రాజకీయాలు చేసినా తెలంగాణలో బీజేపీకి స్థానం లేదన్నారు.  

కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదన్నారు. ఒప్పదం ప్రకారమే  ఆయా ఏరియాల్లో కేటీఆర్ ప్రచారానికి దూరంగా ఉన్నారని ఆరోపించారు. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ విషయంలో మజ్లిస్ తో కాంగ్రెస్ చేతులు కలిపిందని బండి సంజయ్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.