మున్సి పోల్స్‌‌ లో బీసీలదే హవా : ఎంపీ ఆర్‌‌‌‌ కృష్ణయ్య

మున్సి పోల్స్‌‌ లో  బీసీలదే హవా : ఎంపీ ఆర్‌‌‌‌ కృష్ణయ్య
  •     53% సీట్లు గెలిచి రికార్డు కొట్టిన్రు: ఎంపీ ఆర్‌‌‌‌ కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: జనరల్ స్థానాల్లో కూడా బీసీలు పోటీ చేసి మున్సిపల్ ఎన్నికల్లో 53% సీట్లు గెలిచారని ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. ఇది బీసీల చైతన్యానికి నాంది అని పేర్కొన్నారు. ప్రభుత్వం చట్టబద్ధంగా 24 స్థానాలు కేటాయిస్తే అదనంగా జనరల్ స్థానాల్లో మరో 25% కలిపి మొత్తం 53 శాతం బీసీలు గెలిచి రికార్డు సృష్టించారని కొనియాడారు. అన్యాయం చేయాలని కుట్రలు చేసిన పార్టీలకు బీసీలు తగిన గుణపాఠం నేర్పారని కామెంట్‌‌ చేశారు. శనివారం విద్యానగర్‌‌‌‌లోని బీసీ భవన్‌‌లో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

సర్పంచ్‌‌, మున్సిపల్‌‌ ఎన్నికల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచిన తర్వాతే ఎన్నికలకు పోతామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నోసార్లు ప్రకటించి మోసం చేసిందని మండిపడ్డారు. ఇకమీద జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌‌ 42శాతానికి పెంచేదాకా వదిలిపెట్టబోమని అన్నారు.