కాళేశ్వరం లోపాలపై ఎల్అండ్ టీ సంస్థనే అడగండి : శ్రీనివాస్ గౌడ్

కాళేశ్వరం లోపాలపై ఎల్అండ్ టీ సంస్థనే అడగండి : శ్రీనివాస్ గౌడ్

కాళేశ్వరం ప్రాజెక్టును కట్టింది ఎల్అండ్ టీ నిర్మాణ సంస్థ అని, నిర్మాణ లోపాలుంటే వెళ్లి ఆ సంస్థను అడగాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇవాళ  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎల్అండ్ టీ సంస్థ దేశంలోని అనేక  ప్రాజెక్టులు నిర్మించిందని అన్నారు. లోపాలుంటే ఆ సంస్థను ప్రశ్నించాలని అధికార పక్షానికి సూచించారు. కాంట్రాక్టర్లు, అధికారుల వల్ల ప్రాజెక్టులో లోపం జరిగి ఉండవచ్చన్నారు. నాలుగు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పర్యటించిన ఏకైనా  ప్రాజెక్టు కాళేశ్వరమని అన్నారు. ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ బాగుందన్నట్టు కాంగ్రెస్ నేతల స్టేట్ మెంట్లు ఉంటున్నాయని చెప్పారు. ప్రతి పక్ష నేత హోదాలో కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తారని, ఆయన పర్యటనలు తప్పుపట్టడం కరెక్ట్ కాదని చెప్పారు. కాంగ్రెస్ ఎన్నిరోజులు ఉంటదో బీఆర్ఎస్ కూడా అన్ని రోజులే ఉంటుందన్నారు.

ALSO READ :- జాబ్​ క్యాలెండర్​పై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్పీ ట్వీట్