ఒక్క మగాడికి.. ఒక్క భార్యనే.. ఇద్దరు భార్యలుంటే జైలు : కొత్త చట్టం తెచ్చిన అసోం ప్రభుత్వం

ఒక్క మగాడికి.. ఒక్క భార్యనే.. ఇద్దరు భార్యలుంటే జైలు : కొత్త చట్టం తెచ్చిన అసోం ప్రభుత్వం

అసోం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే పాలిగామీ (బహుభార్యత్వం) ని నిషేధించే చట్టాన్ని ఆమోదించింది. అంటే చట్టప్రకారం ఒక వ్యక్తి ఏకకాలంలో ఒకరికంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండటం చట్టవిరుద్ధం ఇకపై.2025లో ప్రతిపాదిత "అసోం పాలిగామీ నిషేధ బిల్లిస్ 2025"ని రాష్ట్ర అసెంబ్లీ ముందు నవంబర్ 25న ప్రవేశపెట్టాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. చట్టాన్ని పాటించని వ్యక్తులను కఠినంగా శిక్షించాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. అలాగే పాలిగామీలో బాధపడిన మహిళలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించేలా కూడా ప్రత్యేక నిధి ఏర్పాటు చేయబడుతోంది. 

పాలిగామీని ఒక నేరమైన చర్యగా గుర్తించి.. మొట్టమొదటి సారి సరైన ప్రక్రియతో విడిపోకపోవడం లేదా గత వివాహాన్ని రద్దు చేయకపోవడం వలన మరొక వివాహం చేసుకునే వ్యక్తికి కొత్త చట్ట ప్రకారం 7 ఏళ్లు కఠిన జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. దీనికింద ఉన్నత న్యాయస్థానం వారెంట్ లేకుండా కూడా నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులకు సౌకర్యం కల్పించబడుతోంది. అయితే రాష్ట్రంలోని వెనుకబడిన తెగలు, షెడ్యూల్ 6 కింద ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు ఈ చట్ట పరిధి వర్తించదు. వారి సాంప్రదాయాలను గౌరవించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అస్సాం ప్రభుత్వం చెబుతోంది. 

అలాగే మైనార్టీ ముస్లింలకు 2005కి ముందు జరిగిన వివాహాలకు ప్రత్యేక మన్నింపు అందించబడుతోంది. కొత్త చట్టం ద్వారా అసోం మహిళల హక్కులను పరిరక్షించటం, లింగ సమానత్వాన్ని ప్రోత్సహింపునకు అద్భుతమైన అడుగుగా ప్రభుత్వం భావిస్తుస్తోంది. అలాగే బహుభార్యత్వం వల్ల ఇబ్బంది ఎదుర్కొంటున్న మహిళలకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు అస్సాం సీఏం హిమంత బిజ్వా సర్మా స్పష్టం చేశారు. ఈ నూతన చట్టం మహిళా సాధికారతకు, సమాజ మార్పులకు కీలకంగా నిలవటంతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా మారొచ్చని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.