ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం

ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం

హైదరాబాద్‌, వెలుగు: ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సోమవారం సభలో ఈ బిల్లును మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టారు. 2022 – 23 ఆర్థిక సంవత్సరానికి 4%, 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో 5% ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపునకు సభ ఓకే చెప్పింది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, అప్పులు చేస్తూ ప్రజలపై భారం మోపవద్దని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సూచించారు. మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ.. దేశంలోనే అతి తక్కువ అప్పులు తీసుకుంటున్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని, జీఎస్డీపీతో పోలిస్తే మన అప్పుల శాతం చాలా తక్కువ అని తెలిపారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ అత్యధిక అప్పులు చేస్తున్నాయని కౌంటర్‌ ఇచ్చారు.