మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ తొలి జాబితా

మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ తొలి జాబితా
  • 144 మందితో మధ్యప్రదేశ్ ఫస్ట్ లిస్ట్
  • చత్తీస్​గఢ్ నుంచి 30 మంది ఎంపిక

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్, చత్తీస్​గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల తొలి జాబితాను ఆదివారం కాంగ్రెస్ అధిష్టానం రిలీజ్ చేసింది. మధ్యప్రదేశ్​లో  144 మందిని, చత్తీస్​గఢ్ లో 30 మందిని, తెలంగాణలో 55 మందిని పార్టీ అభ్యర్థులుగా ఎంపిక చేసింది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం, పీసీసీ చీఫ్ కమల్​నాథ్ చింద్వారా సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ సీఎం, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయ్​లక్ష్మి సాధో మహేశ్వరం (ఎస్సీ) నుంచి, మాజీ మంత్రి జీతు పట్వారి.. రావు సెగ్మెంట్ నుంచి బరిలో ఉంటారు. ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ దీపక్ బైజ్ చిత్రకూట్ (ఎస్టీ) నుంచి బరిలో ఉంటారు.

69 మంది సిట్టింగ్​ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు

మధ్యప్రదేశ్​లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 144 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయింది. వీరిలో 69 మంది సిట్టింగ్​లకే మళ్లీ సీట్లు కేటాయించింది. బుడ్ని నియోజకవర్గం సీఎం శివరాజ్​సింగ్ చౌహాన్​పై పోటీగా కాంగ్రెస్ టికెట్ సినీ నటుడు విక్రమ్ మస్తల్​కు ఇచ్చారు. విక్రమ్ మస్తల్.. రామాయణం సీరియల్​లో హనుమంతుడి పాత్ర పోషించారు. 

చత్తీస్​గఢ్ నుంచి 30 మంది ఎంపిక

90 అసెంబ్లీ స్థానాలు ఉన్న చత్తీస్​గఢ్​లో 30 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ హైకమాండ్​ రిలీజ్ చేసింది.  సీఎం భూపేశ్ బాఘెల్ పటాన్ సెగ్మెంట్ నుంచి, డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ డియో అంబికాపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు.