ఈస్టర్​ వేడుకల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్

ఈస్టర్​ వేడుకల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని చర్చిలో ఆదివారం నిర్వహించిన ఈస్టర్ వేడుకల్లో అసెంబ్లీ స్పీకర్​గడ్డం ప్రసాద్ కుమార్​పాల్గొన్నారు. చర్చి ఫాదర్ ఇచ్చిన సందేశాన్ని విన్నారు. ప్రత్యేక ప్రార్థనలకు హాజరైన భక్తులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వికారాబాద్ లోని ఏకేఆర్ స్టడీ సర్కిల్ కు సంబంధించిన 10 పుస్తకాలతో కూడిన డీఎస్సీ స్టడీ మెటీరియల్ స్పీకర్ గడ్డం ప్రసాద్​కుమార్​ఆవిష్కరించారు. మున్సిపల్ చైర్ పర్సన్ చిగులపల్లి మంజుల, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.