ఖానాపూర్, వెలుగు: నిర్మల్ జిల్లా ఖానాపూర్ లోని కోర్టు ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఏజీపీ(అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్) కార్యాలయాన్ని జేఎఫ్‌సీఎం కోర్టు మేజిస్ట్రేట్ భవిష్య శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేజిస్ట్రేట్ మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థలో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే ఏజీపీ కార్యాలయం సమర్థవంతంగా పనిచేసి ప్రజలకు మెరుగైన న్యాయ సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు.
కోర్టు ఏజీపీ ఆసిఫ్ అలీ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మట్టేరి రాజశేఖర్, న్యాయవాదులు వెంకటమహేంద్ర, కిశోర్ నాయక్, బి.శివ, కమలాకర్, ఐ.వెంకటేశ్, షబ్బీర్ పాషా, నరేంద్ర నాథ్,షేఖ్ ఖదీర్, రవి ఉన్నారు.
