బెల్లంపల్లి: భూ సమస్య పరిష్కరించాలని ఓ రైతు టవర్ఎక్కి నిరసన

బెల్లంపల్లి: భూ సమస్య పరిష్కరించాలని ఓ రైతు టవర్ఎక్కి నిరసన

బెల్లంపల్లి రూరల్, వెలుగు: భూ సమస్యను పరిష్కరించి తనకు న్యాయం చేయాలని ఓ రైతు సెల్​ టవర్​ ఎక్కాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో శుక్రవారం జరిగింది. పోలీసులు, బాధితుడి వివరాల ప్రకారం.. చిన్నగుడిపేట(తెనుగుపల్లి)కు చెందిన రెడ్డి స్వామి అనే రైతు గ్రామ శివారులో సర్వే నంబర్​ 107లో2.16 ఎకరాల భూమిని పదేండ్ల క్రితం ఏటకారి రామయ్య దగ్గర ఒప్పంద పత్రాల ద్వారా కొనుగోలు చేశాడు. ఈ భూమిలో 1.16 ఎకరాలు కమలాపూర్​ ప్రాజెక్టు కాలువలో ముంపునకు గురైంది. 

మిగిలిన ఎకరం భూమిలో తాను కాస్తులో ఉన్నానని, తనకు చెందాల్సిన భూమిని మరొకరికి పట్టా చేయడంతో సెల్​టవర్​ఎక్కి ఆందోళన చేపట్టాడు. న్యాయం చేయాలని లేదంటే పై నుంచి దూకి చనిపోతానని బెదిరించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రెడ్డిస్వామి కిందకు దిగాడు. భూ సమస్యలు ఉంటే పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించుకోవాలని ఆత్మహత్యాయత్నానికి పాల్పడవద్దని నచ్చజెప్పి ఇంటికి పంపారు. కాగా బాధితుడు ఏప్రిల్​28న భీమిని తహసీల్దార్ ​కార్యాలయం ఆవరణలో పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి  పాల్పడ్డాడు.