సమంతని స్పెషల్ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం  కన్విన్స్ చేశా

సమంతని స్పెషల్ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం  కన్విన్స్ చేశా

కథ, స్క్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లే విషయంలో కొత్త ఒరవడిని తీసుకొచ్చిన దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ఆయన డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా సుకుమార్ కాసేపు ఇలా ముచ్చటించారు.

‘‘ఆర్య సినిమా అప్పుడే బన్నీని ఇలాంటి పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ యాటిట్యూడ్ ఉన్న  క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చూపిద్దామనుకున్నాను. అది ఇప్పటికి కుదిరింది. ఏ బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకుందామా అని బాగా ఆలోచించి రెడ్ శాండిల్ స్మగ్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకున్నాను. వేరే ఏదైనా తీసుకోవచ్చు కానీ ఇదైతే సౌత్​లో అందరికీ తెలుసు కాబట్టి బాగా కనెక్టవుతారని ఫీలయ్యాను. ఆరు నెలలు  రీసెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశా. నిజానికి మొదట వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీద్దామనుకున్నాను  కానీ  సినిమా అయితేనే బాగుంటుందని నిర్ణయం మార్చుకున్నాను. హీరోకి కచ్చితంగా ఏదో ఒక మేనరిజం ఉండాలని ‘తగ్గేదే లే’ అనేది పెట్టాం. బాడీ లాంగ్వేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు డైలాగ్స్ ఉంటే త్వరగా కనెక్టవుతాయి. చాలా సీన్స్ నిజంగా జరిగినవే. క్యారెక్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా రియల్ లైఫ్‌లో ఎవరో ఒకర్ని చూసి ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయి రాసుకున్నవే. బన్నీ డెడికేషన్ అద్భుతం. చిత్తూరు శ్లాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం చాలా కష్టపడ్డాడు.  కొన్ని క్యారెక్టర్స్ కొందరు చేస్తేనే సూటవుతాయి. అలాంటి వారిలో రావు రమేష్, సునీల్ ఉంటారు. ఇద్దరి పాత్రలూ బాగా పండాయి. సమంతని స్పెషల్ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం  కన్విన్స్ చేశాను. అన్ని  రకాల పాత్రలు చేసిన ఆమెను ఇలా కూడా చూపించాలనే ఉద్దేశంతోనే తనని సెలెక్ట్ చేసుకున్నాను.  ‘కేజీయఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’తో ఈ సినిమాని పోలుస్తున్నారు. కానీ ఆ సినిమా బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్, విజువల్స్ వేరు. ఇది ఎమోషనల్ బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్. కొత్త ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న కమర్షియల్ సినిమా. దేనితోనూ దీన్ని పోల్చకూడదు. పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌2 కనెక్షన్స్ కోసం ఉంచిన  కొన్ని సీన్స్ ల్యాగ్ అయినట్టు అనిపించొచ్చు. కానీ కొంతవరకే. మిగతాదంతా గ్రిప్పింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేయడానికి రాజమౌళి ఎంకరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంటే కారణం. ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోయినా అక్కడ మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. నిజానికి మాకు టైమ్ లేకపోవడం వల్లే సరైన పబ్లిసిటీ చేయలేకపోయాం. అన్ని విషయాల్లోనూ  నిర్మాతలు ఎంతో సపోర్ట్ చేశారు. ఇక పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌2 అంతా డాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పుష్పరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి కాదు.. ఎర్రచందనం గురించే ఉంటుంది. అసలు కథంతా ‘పుష్ప2’లోనే ఉంది. ఇవే క్యారెక్టర్స్ కంటిన్యూ అవుతాయి. ఎమోషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సన్నివేశాలూ ఎక్కువే. ఫాదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బ్రదర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్య బాండింగ్ లాంటివన్నీ చూపించి కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లూజన్ ఇస్తాం. వచ్చే దసరాకి రిలీజ్ అనుకుంటున్నాం. లేదంటే మళ్లీ డిసెంబర్ 17నే  పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2 రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తాం. దీని తర్వాత విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేవరకొండతో సినిమా ఉంటుంది. ఏ సినిమా తీసినా, ఎవరితో వర్క్ చేసినా నా టార్గెట్ ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్ చేయడమే.’’