ఢిల్లీలో కాంగ్రెస్ నాయకుల కీలక సమావేశం

V6 Velugu Posted on Oct 16, 2021

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం కొనసాగుతోంది. ఏఐసీసీ కార్యాలయంలో సోనియా గాంధీ అధ్యక్షతన వర్కింగ్ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పార్టీ సంస్థాగత ఎన్నికలు, రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై చర్చించనున్నారు. లఖింపూర్ ఖేరి ఘటన, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు, ధరల పెరుగుదల వంటి అంశాలపై చర్చిస్తూ.. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా డిస్కస్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో పార్టీలో అంతర్గత విభేదాలపై చర్చించనున్నారు. తాము అధికారంలో ఉన్న పంజాబ్, రాజస్థాన్ పరిస్థితులపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీయనుంది.

 

 

Tagged Congress, Delhi, Rahul Gandhi, Sonia Gandhi, aicc, CWC

Latest Videos

Subscribe Now

More News