
హైదరాబాద్ లోని మాదాపూర్ లో దారుణం జరిగింది.. నడిరోడ్డుపైనే ఓ యువకుడిని కత్తులతో పొడిచి చంపేశారు దుండగులు. శనివారం ( మే 31 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. మాదాపూర్ యశోద హాస్పిటల్ ఎదురుగా ఉన్న రోడ్డు లో ఇద్దరు యువకులను బేదిరించి దారి దోపిడీకి యత్నంచిన నలుగురు దుండగులు..బంగారం, డబ్బులు ఇవ్వాలంటూ కత్తులతో బెదిరించారు దుండగులు.
మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు వారితో గోడవకు దిగడంతో వారిపై కత్తులతో దాడికి దిగారు దుండగులు. ఈ గోడవలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉదయాన్నే ఈ ఘటన గురించి తెలిసి ఉలిక్కిపడ్డారు స్థానికులు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మాదాపూర్ పోలీసులు. శుక్రవారం అర్ధరాత్రి 1:30 సమయంలో డయల్ హండ్రెడ్ నుండి ఫిర్యాదు కాల్ వచ్చిందని.. యశోద హాస్పిటల్ వెనుక ఒక వ్యక్తి హత్య జరిగినట్టు సమాచారం వచ్చిందని తెలిపారు పోలీసులు.హాస్పిటల్ వెనుక భాగంలో ఉన్న నిర్మాణుష్య ప్రదేశంలో కొంతమంది వ్యక్తులు పార్టీ చేసుకుంటుండగా గుర్తుతెలియని వ్యక్తులు అక్కడికి వచ్చి.. పార్టీ చేసుకునే వ్యక్తుల దగ్గర నుండి మందు బాటిల్ కావాలని అడగడంతో ఇద్దరు మధ్యలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది.
గొడవ తీవ్రమవడంతో ఒక వ్యక్తి అతని వద్ద ఉన్న కత్తితో జయంత్ గౌడ్ పై విచక్షణారహితంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. కొన ఊపిరితో ఉన్న మృతుని యశోద హాస్పిటల్ కి తీసుకురాగా అప్పటికే మరణించినట్టు తెలిపారు డాక్టర్లు. దాడి అనంతరం దుండగులు సంఘటన స్థలం నుంచి పరారయ్యారుని.. దాడి సమయంలో మృతుడు జయంత్ గౌడ్ తో పాటు అతని స్నేహితులు ఏడుగురు ఉన్నట్లు సమాచారం.నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు పోలీసులు
హైదరాబాద్ లో ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువవుతున్నాయి.. శుక్రవారం ( మే 30 ) గండిపేటలో అప్పు పైసలు ఇవ్వలేదని.. ఫుల్ గా మద్యం తాగి స్నేహితుడిని హతమార్చాడు ఓ యువకుడు.
హైదరాబాద్ ఎర్రబోడ ప్రాంతానికి చెందిన సాయికార్తీక్ (29), నవీన్, సిద్ధూరెడ్డి ఫ్రెండ్స్. సిద్ధూరెడ్డి భార్యతో విడిపోయి ఉంటున్నాడు. కొంతకాలం కింద ముగ్గురూ కలిసి వ్యాపారం ప్రారంభించగా, సిద్ధూరెడ్డి రూ. 6 లక్షలు అప్పు ఇచ్చాడు. తిరిగి ఇవ్వమంటే సాయి కార్తీక్, నవీన్ తప్పించుకొని తిరుగుతున్నారు. అలాగే తన భార్య నుంచి విడిపోవడానికి కూడా వీరిద్దరే కారణమని కక్ష పెంచుకున్నాడు. తన ప్లాన్లో భాగంగా గురువారం రాత్రి ఇద్దరిని తన ఇంటికి పిలిపించి, ఫుల్గా మద్యం తాగించాడు.