మొయినాబాద్‎లో వీర రాఘవరెడ్డి పై దాడి

మొయినాబాద్‎లో వీర రాఘవరెడ్డి పై దాడి

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్​రంగరాజన్‎పై రాఘవరెడ్డి అనే వ్యక్తి దాడి చేయడం అప్పట్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా వీర రాఘవ రెడ్డిపై దాడి జరిగింది. గురువారం (మే 1) కండిషన్ బెయిల్‎పై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‎కు వెళ్లి వస్తుండగా వీర రాఘవ రెడ్డిపై 20 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్‎లో సంతకం చేసి తిరిగి వచ్చి ఓ టీ స్టాల్ వద్ద ఆగిన వీర రాఘవరెడ్డిపై దుండగులు ఎటాక్ చేశారు. దుండగుల దాడిలో వీర రాఘవ రెడ్డి గాయపడ్డాడు. గమనించిన స్థానికులు అడ్డు రావడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం వీర రాఘవ రెడ్డి మొయినాబాద్ పీఎస్‎లో ఫిర్యాదు చేశాడు. 

వీర రాఘవ రెడ్డి ఎవరు..సైన్యం..?

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన కొవ్వూరి వీర రాఘవరెడ్డి రామరాజ్యం పేరుతో  ప్రైవేట్ సైన్యం నడిపిస్తున్నాడు.  దేశంలో రామరాజ్యం ఏర్పాటు కావాలని.. ప్రచారం చేస్తుంటాడు.  పదో తరగతి పాసైన లేదా ఫెయిల్ అయిన యువకులను తన సైన్యంలో రిక్రూట్ చేస్తూ వస్తున్నాడు. 5 కిలో మీటర్లు నడిచే సామర్థ్యం, రెండు కిలో మీటర్లు పరిగెత్తే సామర్థం ఉండాలి. వయసు 20 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.  ఒక్కొక్కరికి రూ.20వేల జీతం .

యువతను తన సైన్యం చేర్చుకుంటూ వాళ్లతో ఇలాంటి దౌర్జన్యాలు చేయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చిలుకూరు బాలాజీ అర్చకుడు రంగరాజన్‎ను తన రామరాజ్యం సైన్యంలో  చేరాలంటూ ఒత్తిడి చేశాడు. చేరను అన్నందుకు ఆయన ఇంటిపై దాడి చేశాడు వీర రాఘవ రెడ్డి. అతని కుమారుడిని తన ప్రైవేట్ సైన్యంతో కొట్టించాడు. గతంలో హైదరాబాద్ అబిడ్స్‎లో కూడా వీర రాఘవరెడ్డిపై దాడి కేసు నమోదు అయ్యింది.